ప్రజాసేవే లక్ష్యంగా.. పోటీ చేస్తున్నా!

ప్రజాసేవే లక్ష్యంగా.. పోటీ చేస్తున్నా!

  • 5వ వార్డు బీజేపీ అభ్యర్థి పాలకుర్తి రాధిక సోమశేఖర్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పాలకుర్తి రాధిక సోమశేఖర్ ఎన్నికలో పోటీ చేస్తున్నారు. గురువారం ఇంటింటి ప్రచారంలో భాగంగా అభ్యర్థి వార్డు ప్రజల సమస్యలను తెలు సుకొని పలు కీలక హామీలు ఇచ్చారు. గ్రంధాలయం ఏరియా, హను మాన్ టెంపుల్ ఎదురుగా సీసీ రోడ్లు లేవు. మోరీలు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నాయని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిష్కరించి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామ ని హామీ ఇచ్చారు. పాలకుర్తి ఏరియాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.

రాని వారు ఇండ్ల అవసరం ఉందని ప్రజలు కోరారు. అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వికలాం గులు, వితంతువులకు పెండింగ్‌లో ఉన్న పింఛన్లు ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో లింక్ రోడ్లు అవస రమని ప్రజలు కోరగా వాటి ఏర్పాటు చేస్తామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పారు. వార్డులో ప్రజా సమస్య లను నేరుగా వినేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, యువత కోసం పెద్ద గ్రంధాలయం ఏర్పా టు చేయడం తో పాటు బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తా మని పేర్కొన్నారు.

పేదరిక రేఖకు దిగువన ఉన్న అర్హులైన పేద ఆడబిడ్డల వివాహం, విద్య కోసం సహాయం అందిస్తాను. ట్రైన్ పద్మావతి, శత వాహనం హాల్టింగ్ కోసం సంబంధిత అధికారులతో చర్చించి కృషి చేస్తా మని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీరియల్ నెంబర్ 3లో ఉన్న బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిం చండి. గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తా నని పిలుపునిచ్చారు.

Leave a Reply