Palakurthi | ఘనంగా వైకుంఠ ఏకాదశి

Palakurthi | ఘనంగా వైకుంఠ ఏకాదశి
Palakurthi | పాలకుర్తి, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశి వేడుకలు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో అత్యంత వైభవంగా ఇవాళ జరిగాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో భక్తులు తమ దైవాన్ని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే దేవాలయాల బాటపట్టారు. మంగళ వాయిద్యాల మధ్య తెరుచుకున్న ఉత్తర ద్వారం నుంచి ఆలయ ప్రవేశం కోసం భక్తజనం బారులు తీరారు.
