MLA | నిరుపేదలందరికీ సొంత గృహాలు..

MLA | నిరుపేదలందరికీ సొంత గృహాలు..


.కొత్తగా 1.38 లక్షల గృహాలు మంజూరు..
.త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు…
.త్వరలోనే సామూహిక గృహప్రవేశాలు..

తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు

MLA | తిరువూరు, ఆంధ్రప్రభ, : నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలందరికీ సొంత గృహాలు అందించే బాధ్యత తనదని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొత్తగా 1.38 లక్షల గృహాలు మంజూరయి ఉన్న ఆయన త్వరితగతిన వీటి నిర్మాణాలు పూర్తి చేసి సామూహిక గృహప్రవేశ లు చేయిస్తామన్నారు. పట్టణంలోని శాసన సభ్యులు వారి కార్యాలయము లో గృహనిర్మాణ శాఖ (Housing Department) అధికారులతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. తిరువూరు పట్టణములో ఇప్పటి వరకు కొత్తగా ఇల్లు కట్టుకొనే వారికి కాలనీ ఇల్లు ఎన్ని మంజూరు అయ్యాయి,ఇంకా కొత్తగా అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ,ఎంత సమయం ఉంది అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


తిరువూరు (Tiruvuru) పట్టణానికి సంబంధించి ఇప్పటి వరకు 138 కాలనీ ఇల్లు మంజూరు అయ్యాయి అని, ఇంక కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ నెల 30వ తేదీ లోపు వారి వారి పరిధిలోని సచివాలయాలను సంప్రదించి అప్లై చేసుకోవాలి అని అధికారులు ఎమ్మెల్యే కి వివరించారు. అనంతరం కొత్తగా మంజూరు అయిన 138 ఇళ్లకు గాను వచ్చే వారములో శంకుస్థాపన చేసేలే ప్రణాళికలు సిద్ధం చెయ్యమని అధికారులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదేశించారు

Leave a Reply