Out sourcing | ఆదివాసులకు ఆన్యాయం…

Out sourcing | ఆదివాసులకు ఆన్యాయం…
Out sourcing | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఔట్సోర్సింగ్(Out sourcing) ఉద్యోగులకు ఇటీవల పత్రికలలో ప్రాచురితమైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఆదివాసులకు చాలా అన్యాయం జరిగిందని, ప్రభుత్వం ఆదివాసీలను చులకన భావంతో చూస్తుందని అనడంలో స్పష్టంగా కనబడుతుందని ఆదివాసి సంఘాల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడేంట్&మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు(Kanaka Yadav Rao) విమర్శించారు.
ఆయన ఈ రోజు నాయకులతో కలిసి మాట్లాడుతూ.. శాన్వి సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ(Sanvi Services Outsourcing Agency) పేరుతో ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటన(Job Advertisement)ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల యందు ఉద్యోగ ప్రకటన అందించిన సాన్వి సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వారు ఆదివాసులకు ఏ ఒక్క పోస్టు నందు కూడ రిజర్వేషన్ కల్పించకుండ అన్ని ఏకపక్షాన ఇతర వర్గాలకు కేటాయించడం ఇది ఏంత వరకు సమంజసం అన్నారు. ఇబ్బందులకు గురిచేసే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి జిల్లాలోని కొత్తవారికి ఆవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
