Operation Revange : ప‌శ్చిమాసియా ల‌బోదిబో Andhra Prabha News

Operation Revange : ప‌శ్చిమాసియా ల‌బోదిబో Andhra Prabha News

  • 16 ఇరాన్ నౌకలపై అమెరికా దాడి
  • లెబ‌నాన్ పై ఇజ్రాయెల్ గురి
  • 7గురు దుర్మ‌ర‌ణం
  • ఇరాన్ ‘ఆపరేషన్ రివేంజ్’ షురూ
  • అమెరికా ఆస్తుల‌పై డ్రోన్ అటాక్
  • ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ అలర్ట్
  • గల్ఫ్ దేశాల్లో డ్రోన్లు, క్షిపణుల అడ్డుకట్ట
  • యుద్ధం ఆపాలని ప్రపంచ దేశాల పిలుపు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, టెహ్రాన్ )

 Operation Revange

అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆప‌రేష‌న్ 12వ రోజుకు చేరుకుంది. ఇరాన్ ఏకైక ల‌క్ష్యంగా .. అమెరికా జంట వైమానిక దాడుల‌తో ఇరాన్ పౌర వాసాల‌పై స్వెర విహారం చేస్తుంటే..ఇక ఇరాన్ కూడా ప్ర‌తీకార దాడుల‌ను ముమ్మ‌రం చేసింది. అమెరికాకు అడ్డ‌గా మారిన గ‌ల్ఫ్ దేశాల‌పై క్షిప‌ణుల‌ను కుమ్మ‌రిస్తోంది. డ్రోన్ జోరును పెంచింది. బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచే యుద్ధం కొత్త పుంత‌లు తొక్కుతోంది. హోర్ముజ జ‌ల‌సంధిలో 16 ఇరానీ మైనింగ్ షిప్పుల‌నఉ ధ్వంసం చేసిన‌ట్టు అమెరికా ప్ర‌క‌టించింగా.. ఇరాక్ లోని అమెరికా దౌత్య కార్యాల‌యంపై డ్రోన్ తో ఇరాన్ విరుచు ప‌డింది. మ‌రో వైపు ఇరాన్ దూకుడును గ‌ల్ఫ్ దేశాలు అడ్డుకుంటున్నాయి.

Operation Revange : మిడిల్ ఈస్ .. ల‌లోదిదో

 Operation Revange

ప‌శ్చిమాసియా (Middle East)లో బుధ‌వారం యుద్ధ పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. టెహ్రాన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా ఈ రోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైన్యం (IDF) భారీ దాడులు ప్రారంభించింది.
గడిచిన 11 రోజుల్లో దాదాపు 10,000 త‌మ పౌర ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు జ‌రిపిన‌ట్టు ఇరాన్ ఆరోపించింది. పర్షియన్ గల్ఫ్‌లో చమురు రవాణానేపథ్యంలో, అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన 16 మైన్-లేయింగ్ (గనుల నాటిన) నౌకలను ధ్వంసం చేసింది. దక్షిణ లెబనాన్‌లోని ఖానా, టైర్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఏడుగురు మరణించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. బనాన్‌లోని బీరుట్ శివారు ప్రాంతాన్ని కూడా తాకిందని దాని సైన్యం తెలిపింది.

Operation Revange : ఇరాన్ ఆప‌రేష‌న్ రివేంజ్

 Operation Revange

ఇరాన్ ప్రతీకార దాడులు తారా స్థాయికి చేరుకున్నాయి. బుధవారం ఉదయం ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణులు దూసుకువచ్చినట్లు ఐడిఎఫ్ (IDF) ధృవీకరించింది. టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యాయి. తమ ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా సైనిక స్థావరాలు మధ్య ఇజ్రాయెల్‌పై “35వ విడత” దాడులను ప్రారంభించినట్లు ఇరాన్ ప్రకటించింది. “అత్యంత భారీ ఆపరేషన్”ను ప్రారంభించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్ర‌క‌టించింది. రాత్రిపూట దాడిలో ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై US ఆస్తులపై లాంగ్-రేంజ్ బాలిస్టిక్ ఖోర్రామ్‌షహర్ క్షిపణితో సహా క్షిపణి ప్రయోగాలు జరిగాయని ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ IRIB నివేదించింది. ఇదే త‌రుణంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు అప్ర‌మ‌త్తం కాగ‌, బుధవారం ఉదయం మధ్య ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉత్తర తీరంలో ఒక కంటైనర్ నౌక దెబ్బతింది.
గుర్తుతెలియ‌ని దాడిగా భావిస్తున్నారు. ఈ నౌక UAE యొక్క రసల్ ఖైమాకు వాయువ్యంగా ఉంది . త‌మ గ‌గ‌న‌త‌లంలో ప్ర‌వేశించిన ఇరాన్ డ్రోన్లు, క్షిప‌ణుల‌ను బ‌హ్రె యిన్, ఇరాక్, కువైట్, ఖతార్, యూఏఈ , సౌదీ అరేబియా అడ్డుకున్నాయి.

Operation Revange : రంగంలో ప్రాన్స్‌.. ఖతార్

 Operation Revange

పెరుగుతున్న చమురు ధరలు యుద్ధ సంక్షోభంపై చర్చించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఈరోజు (మార్చి 11) G7 దేశాల నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మ‌ధ్య ప్రాచ్యంలో శాంతి నెల‌కొల్ప‌టానికి అమెరికా, ఇరాన్ మ‌ధ్య చ‌ర్చ‌లు ప్రారంభించాల‌ని ఖ‌తార్ విదేశాంగ శాఖ మంత్రి మ‌హ్మ‌ద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఖులైఫీ అన్నారు. గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ , అటు ఇరాన్ పై అమెరికా దాడులతో ఎవ‌రికీ ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. గ‌ల్ఫ్ దేశాల‌కు ఇరాన్ శ‌త్రువు కాద న్నారు. త‌క్ష‌ణం అమెరికా, ఇరాన్ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు అనివార్యం అన్నారు. ఇక ఉత్తర కొరియా సైతం గ‌ళం విప్పింది. ఇరాన్‌పై దాడులపై ఉత్తర కొరియా అమెరికా, ఇజ్రాయెల్‌ను విమర్శించింది. కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకునే టెహ్రాన్ హక్కును తాను గౌరవిస్తున్నానని కిమ్ వ్యాఖ్యానించారు.

ALSO : Aussie Entry గ‌ల్ఫ్ లో పెద్ద‌న్న మాయం Andhra prabha Analysis

Leave a Reply