Ootkur | శ్రీశైల మల్లన్న సన్నిధికి తరలి వెళ్లిన శివస్వాములు..

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నియమనిష్టలతో కఠోర దీక్ష చేపట్టిన శివమాలధారణ స్వాములు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ శివాలయం వద్ద ఇరుముడులు కట్టుకొని బుధవారం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి తరలివెళ్లారు. ఓబులాపూర్ గ్రామ శివారులో ఉన్న శివాలయంలో గురు స్వాములు రఘు, బాల్ లింగప్ప రామలింగప్ప, రవి, శంకరప్ప ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకం ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం ఇరుముడిలో కట్టుకొని శ్రీశైలానికి బయల్దేరారు.

ఎంతో భక్తి శ్రద్ధలతో శివమాలధారణ చేపట్టిన స్వాములు మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతుండడంతో కుటుంబ సభ్యులు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చిడప్పుమేళ తాళాలు మంగళ హారతులతో స్వాములకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ స్వామివారి దివ్యదర్శనం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ తాలూకా మాదాసి కుర్వ సంఘం అధ్యక్షుడు అంజప్ప, ఓబులాపూర్ అధ్యక్షులు బీమప్ప, ఇందిరమ్మ కమిటీ సభ్యులు శంకరప్ప తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply