Ootkur | విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించాలి..

Ootkur | విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించాలి..

  • తపస్ జిల్లా నారాయణపేట అధ్యక్షుడు నరసింహా

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచడమే వివేక్ నేతాజీ ప్రతిభ పరీక్షలని తపస్ ఉపాధ్యాయ సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షుడు నరసింహ, జిల్లా కార్యదర్శి రవీందర్ అన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఊట్కూర్ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఊట్కూర్, పెద్దజట్రం, చిన్నపొర్ల, పులిమామిడి కేంద్రాలుగా నిర్వహించిన వివేక్ -నేతాజీ ప్రతిభ టెస్ట్ కు విశేష స్పందన రావడం జరిగిందని మండల అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, గోపాల్ లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహా, రవీందర్ లు మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా వికాసం కోసం క్విజ్ పోటీలు, ఉపాన్యాస, వ్యాసరచన, ప్రతిభ టెస్ట్ వంటివి అనేకం నిర్వహిస్తూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులలో పోటీతత్వం పెంపొందిస్తూ భవిష్యత్తులో వారు ఎదుర్కోబోయే కాంపిటేటీవ్ పరీక్షలకు బాటలు వేయుటకు నిరంతరం కృషి చేస్తుంద‌ని కొనియాడారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి ప్రతిభ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడుతూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కుసుమ, గౌరమ్మ, సత్యనారాయణలు తపస్ మండల శాఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మండలంలోని ఆయా పాఠశాలల నుండి 147 మంది విద్యార్థులు ప్రతిభ టెస్ట్ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు శేషప్ప, రాములు, మురళీధర్, వెంకటేష్ గణప, జయశ్రీ, విజయలక్ష్మీ, పారిజాత, రఘు రామేశ్వర్ రెడ్డి, రవీందర్ నాయక్, మండల నాయకులు పృథ్వి రాజ్, బన్నేష్, ధనుంజయ, తిరుపతి నాయక్, వీర మహేందర్, ప్రతిభ, రమేష్, శిరీష, శ్రీనివాస్, కేశవులు, ప్రవీణ్, అనిత, వసుంధర, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గురునాథ్, రామేశ్వర్ రెడ్డి, సంతోష్ కుమార్, విక్టర్ పాల్, శివరాజ్, ఆనంద్, హాజీ బాబా, నవనీత, గోదావరి, ఉపాధ్యాయులు సత్యపాల్, విజయ్ కుమార్, గోపాల్, సంతోష్ కుమార్, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply