AP | అలా చేస్తేనే.. రైతుల అభివృద్ది..

AP | అలా చేస్తేనే.. రైతుల అభివృద్ది..

AP | కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : పంచ సూత్రాల ద్వారానే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఘంటసాల గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ముగ్గురు రైతులతో(With three farmers) మాట్లాడారు. సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధర, యాంత్రీకరణ, పుడ్ ప్రాసేసింగ్ యూనిట్లు, ప్రభుత్వం నుంచి మద్దతు ధర కల్పిస్తునట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తునట్టు తెలిపారు.

ఇటీవల మొందా తుఫాను కారణంగా నష్టపోయిన పంట వివరాలు నమోదు చేసినట్టు తెలిపారు. నీటి సంఘాలను నియమించిన రైతులకు మేలు చేశాం అన్నారు. రైతులకు అవసరమైన సబ్సిడీ పరికరాలు (Subsidized devices) అందిస్తునట్టు చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 14 వేలు ఇప్పటి వరకు జమ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏపీఎస్ఆర్టీసి చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అధికారులు, నేతలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply