One chance | కొత్తపల్లి అభివృద్ధే నా లక్ష్యం…
ఒక్క ఛాన్స్ ఇవ్వండి..మార్పు చేసి చూపిస్తా
3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి
సర్పంచ్ అభ్యర్థి ముక్కెర స్వరూప రవి కుమార్ యాదవ్
One chance | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మార్పు చేసి చూపిస్తాను.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాను. డిసెంబర్ 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి.. అవకాశం కల్పించాలని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముక్కెర స్వరూప రవి కుమార్ యాదవ్ కోరారు. శనివారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా సర్పంచ్ గా గెలిపించి ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను కోరుకున్నారు. అవకాశం ఇస్తే గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధిపై పలు హామీలను వెల్లడించారు. గ్రామంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపడతానన్నారు. గ్రామంలో హైమాక్స్ లైట్లు ఏర్పాటు, రెండు బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో సైడ్ డ్రైనేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు.
యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసం కృషి చేస్తానన్నారు. వృద్ధులు, దివ్యాంగులు అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా వ్యవస్థను బలోపేతం చేస్తానన్నారు. మొత్తంగా గ్రామ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ గ్రామానికి సమర్థవంతమైన పరిపాలన అందించడమే తన లక్ష్యమని ముక్కెర స్వరూప రవి కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

