Old is gold | పాత ట్రాక్టర్ విలువ కోటి 25 లక్షలు…

Old is gold | పాత ట్రాక్టర్ విలువ కోటి 25 లక్షలు…

పాత ట్రాక్టర్ తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు

Old is gold |వెబ్ డెస్క్ ఆంధ్ర ప్రభః సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారో ఉహతీతం. అలాంటి సంఘటన భారతదేశంలో జరిగింది. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంటపడింది. ఆ ట్రాక్టర్ అత్యంత అరుదైన మోడల్ అని సదరు వ్యక్తి గుర్తించాడు. దానిని ఏకంగా రూ. 1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. కోటి ఇరవై ఐదు లక్షలు రావడంతో ఆ కుటుంబంమంతా అనంద సముద్రంలో మునిగింది.

Leave a Reply