ఎంపీఓ దంపతులను ఆశీర్వదించిన అధికారులు

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల పంచాయతీ అధికారి భుఖ్య శశి కుమార్ శ్రావణి వివాహ వేడుకలు గురువారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బిల్లాల్ గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జైనూర్ ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, జైనూర్ తాసిల్దార్ ఆడబీర్షావ్, తో పాటు అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

వారికి కానుకలు సమర్పించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో జై నూర్ సూపర్డెంట్ శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ మోహన్, టైపిస్ట్ గౌతమ్ జైనుర్ మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు ధరమ్ సింగ్, ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగులు మండల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply