Observation | నామినేషన్ల కేంద్రాల పరిశీలన

Observation | నామినేషన్ల కేంద్రాల పరిశీలన
Observation | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలంలో సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి పరిశీలించారు (Observation ). ఈ రోజు హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం క్లస్టర్ పరిధిలోని నాగారం, పైడిపల్లి, మల్లక్ పేట్ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
సందర్భంగా సంబంధిత అధికారులకు ఆయన సూచనలు, సలహాలు అందించారు. నామినేషన్ల స్వీకరణ (nominations Reception) ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వెంట పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, ఎమ్మార్వో విజయలక్ష్మి, ఎంపీడీవో విమల తదితరులు ఉన్నారు.
