observation | బీజేపీకి పట్టం కట్టండి..

observation | బీజేపీకి పట్టం కట్టండి..

  • అభివృద్ధి అంటే చూపిస్తాం..
  • రాష్ట్రం ప్రభుత్వం వద్ద రూపాయి లేదు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో ఒరిగేది శూన్యం
  • కేంద్రం నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

observation | జమ్మికుంట, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లాలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడితే.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ స్థలంలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి రూ.6.5 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో అధికారులతో కలిసి కాలేజీ స్థలాన్ని బండి సంజ‌య్ పరిశీలించారు. సింథటిక్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందితో సమావేశమై వారి సూచనలను తీసుకున్నారు. కాలేజీలోని కొంత స్థలం కబ్జాకు గురైందని, ఆ స్థలాన్ని తిరిగి కాలేజీకి అప్పగించాలని కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మికుంటలో స్టేడియం నిర్మించాలని గతంలో అనేక ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయను కలిసి ఆ ప్రతిపాదనలు అందజేయగా, రూ.6.50 కోట్లు మంజూరు చేశారన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చి స్టేడియం నిర్మిస్తామని, మోదీ ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా మోదీ ప్రభుత్వం కాగితాలకే పరిమితం కాదదని, వెంటనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే కాలేజీకి సంబంధించి కొంత స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదులు వచ్చాయని, కబ్జాలకు నేను పూర్తి వ్యతిరేకమని, ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల స్థలాల జోలికి వస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు.

observation

గతంలో కరీంనగర్‌లో ఇలాగే కొందరు చేస్తే పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలన్నారు. జమ్మికుంటలోనూ కబ్జాలపై చర్యలు తప్పువని, ప్రభుత్వ కాలేజీ స్థలాన్ని కాపాడతానన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చైర్మన్ బీజేపీ కాదని, రాష్ట్రంలో అధికారంలో లేమని, అయినా కేంద్ర మంత్రిగా జమ్మికుంటతోపాటు హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నానన్నారు. ఇటీవల జమ్మికుంటతోపాటు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.3 కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్స్ ను అందజేశామన్నారు.

నియోజకవర్గంలో అనేక కుల సంఘాలకు, గుడి కోసం, బడి కోసం నిధులిచ్చామని, ఈజీఎస్ పేరుతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. జమ్మికుంట పేరుకే మున్సిపాలిటీ.. కానీ అభివృద్ధి లేదన్నారు. వర్షాలొస్తే మునిగిపోయే కాలనీలు చాలా ఉన్నాయని, అభివృద్ధికి సహకరించే వారు లేరన్నారు. ప్రతిపాదనలు పంపే వారు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. అందుకే జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించాలని, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు.

Leave a Reply