NTR | యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన నేత ఎన్టీఆర్

NTR | యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన నేత ఎన్టీఆర్
- ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు
NTR | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : సినీ వినీలాకాశంలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రజలను మెప్పించిన ఎన్టీఆర్ ఆరాధ్య నటుడిగా నిలిచాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకీ సత్యనారాయణ, వైరా నియోజకవర్గం నాయకులు లకావత్ గిరిబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మలోత్ మంగీలాల్ నాయక్ కొనియాడారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంఎల్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేసాయన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రజాదరణ పొందిందని, రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత కల్పించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందని నేతలు చెప్పారు. సినీ నటుడిగా ఎన్టీఆర్ సినిమాలో పోషించిన రాముడు, కృష్ణుడు పాత్రలు భగవంతుడి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్లు కొమ్మినేని పాండురంగారావు, పులదాసు కృష్ణమూర్తి, దుద్దుకూరి నాగేశ్వరరావు, ఏన్కూర్ ఎఎంసి మాజీ డైరెక్టర్ బాదావత్ బాలాజీ, టీడీపీ నాయకులు తాళ్లూరి అప్పారావు, టీఆర్ఎస్ అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, మంగమూడి నాగేశ్వరరావు, సిపిఐ నేత గుండెపున్ని వెంకటేశ్వర్లు, పెంటికల వీరబాబు, నున్న రంగారావు, యల్లంకీ చిన్న నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కో సీతాకుమారి, మాజీ ఎంపీటీసీ సాయిల నాగేశ్వరరావు, దుద్దుకూరి సుమంత్, వడ్డే వెంకట నారాయణ, మాజీ ఎంపీటీసీ బానోత్ రాంజీ, సాయిన్నీ కృష్ణార్జునరావు, ఇల్లంగి తిరుపతి, బుడిపూడి ప్రభాకర్, పోతురాజు రామారావు, ఇంజం ముత్తేశ్వరరావు, తాళ్లూరి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
