ELECTION| నామినేష‌న్ ‘పంచాయితీ’!

ELECTION| నామినేష‌న్ ‘పంచాయితీ’!

  • భద్రాచలం పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధం?
  • భద్రాచలం బీజేపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
  • ఫార్మాట్ ప్రకారమే నామినేషన్ ఉంది: హరిశ్చంద్ర నాయక్
  • నామినేషన్ పత్రాలు స‌రిగా లేవ‌ని బీఆర్ఎస్ ఆరోపణ
  • కలెక్టర్ ఎదుట పంచాయితీ

ELECTION| భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలం పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ (Harishchandra Nayak) నామినేషన్ పత్రాలపై సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ల (nominations) ను తిరస్కరించారు. ఆదివారం సాయంత్రం ఆ అధికారి ఎదుట పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. స్క్రూట్ ని సందర్భంగా బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ కూటమి అభ్యంతరాలు వ్య‌క్తం చేసింది.

ఈ క్రమంలో బీజేపీ కూటమి నాయకులు దీనిపై రిటర్నింగ్ అధికారితో (with the officer) వాదన దిగారు. ఓ సందర్భంలో అధికారి నామినేషన్‌ను అంగీకరించే పరిస్థితి (situation) తలెత్తింది. బీఆర్ఎస్, సీపీఎం, గోండ్వానా కూటమి ఎన్నికల అధికారులు అప్లోడ్ చేసిన నామినేషన్ పత్రంలో అభ్యర్థి వివరాలు, సంతకాలు సరిగా లేవని చెబుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సేవ్ డెమోక్రసీ అంటూ ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ నెలకొంది.

ఈ క్రమంలో బీఆర్ఎస్, సీపీఎం, గోండ్వానా కూటమి వాదనలతో ఏకీభవించిన ఎన్నికల (Unanimous election) రిటర్నింగ్ అధికారి ఆదివారం రాత్రి బీజేపీ అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ నామినేషన్ పత్రాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారని తెలుపుతూ లిఖితపూర్వకంగా కాగితాన్ని అందించి నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

బీఆర్ఎస్ కూటమి అలా… బీజేపీ కూటమి ఇలా..
బీఆర్ఎస్ కూటమిలో ఉన్న సీపీఎం నాయకులు.. బీజేపీ(BJP) అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాన్ కార్డు, ఆధార్ కార్డ్ త‌దిత‌ర‌ వివరాలను అభ్యర్థి పేర్కొనలేదన్నారు. ఇదే క్రమంలో అభ్యర్థి ఒక పేజీలో అడ్డంగా గీతాలు కొట్టి వివరాలు వేరే కాగితంపై (on paper) రాశామని తెలిపిన, ఏడ‌వ‌ కాలమ్ ఖాళీగా వదిలిపెట్టారని, అదే కాగితంలో సంతకం కూడా చేయలేదని, మరో రెండు చోట్ల కూడా సంతకాలు లేవని ఆరోపించారు. దీనికి ప్రత్యుత్తరం ఇస్తూ బీజేపీ కూటమి నాయకులు తాము అన్నిచోట్ల సంతకాలు చేశామని, వివరాలు (Details) నింపేందుకు ఖాళీ లేనందువల్ల వేరే కాగితాన్ని విడిగా జతపరిచామని తెలిపారు.

పైగా తాము రెండవ సెట్టు నామినేషన్ కూడా వేశామని, అది పూర్తిగా నిబంధనకు లోబడి ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కూటమిలోని సీపీఎం (CPM) నాయకులు మాత్రం రెండవ సెట్టులో తేదీని వెయ్యలేదని, అందులో కూడా అనేక వివరాలను పొందుపరచలేదని వాదిస్తున్నారు. పైగా రెండవ సెట్టు నామినేషన్లను వెబ్‌సైట్‌లో అప్లోడ్ (UPLOAD) చేయలేదని సీపీఎం నాయకులు వాదించారు. అధికారులు రెండవ సెట్టు నామినేషన్‌ను అధికారిక సైట్‌లో అప్లోడ్ చేయకపోవడం తమ పని కాదని బీజేపీ నాయకుల వాదన.

ఈ క్రమంలో సోమవారం ఈ పంచాయతీ కలెక్టర్ ముందుకు వెళ్ళింది. హరిచంద్ర నాయక్ కలెక్టర్ ఎదుట‌ ఈ వ్యవహారం తేలకపోతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు (as if ready) సమాచారం. మరోవైపు బీఆర్ఎస్, సీపీఎం నాయకులు కూడా ఈ విషయాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. కలెక్టర్ నిర్ణయం తర్వాతే ఏం జరుగుతుందో తెలుస్తుంది.

Leave a Reply