Nomination | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హౌస్ అరెస్టు :
Nomination | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ సమస్యల పైన, నిలిచిపోయిన అభివృద్ధి పనులపై, రద్దు చేసిన నిధుల గురించి బహిరంగ లేఖా విడుదల చేశారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి(MLA Madhava Reddy) గాని, ప్రభుత్వం గాని బహిరంగ లేఖాకు ఎలాంటి సమాధానం చెప్పలేక పోలీసులతో ఈరోజు హౌస్ అరెస్టు చేయించినట్లు పెద్ది ఆరోపించారు.
ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నియోజవర్గ వ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల నిర్వహిస్తున్న ప్రభుత్వం మూడో దశ నామినేషన్(Nomination) చివరి రోజున బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులను, నాయకులను, అభ్యర్థులను అరెస్టులు చేపిస్తూ నామినేషన్లను అడ్డుకుంటున్నట్లూ ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదనీ ఆయన హెచ్చరించారు.

