nomination | మీ ఆడబిడ్డగా ఆశీర్వదించండి

nomination | మీ ఆడబిడ్డగా ఆశీర్వదించండి
nomination | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మీ ఇంటి ఆడబిడ్డగా తమను ఆశీర్వదించాలని బిక్కనూరు పట్టణ సర్పంచ్ అభ్యర్థి సరిత నరసింహారెడ్డి(Saritha Narasimha Reddy) కోరారు. ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాకాలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. తమను సర్పంచిగా గెలిపిస్తే పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం(solution to public problems) కోసం తాను సర్పంచిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. సర్పంచిగా తమ కాషాయం కల్పించాలని పట్టణ ప్రజలను ఆమె కోరారు.
