బైంసాలో నో స్టాక్ పెట్రోల్

బైంసాలో నో స్టాక్ పెట్రోల్

భైంసా పట్టణంలోని గీత పెట్రోల్ బంక్ లో బారులు తీరిన బైకులు

బైంసా/ కుంటాల, ఆంధ్రప్రభ : పెట్రోల్ బంకులలో నో స్టాక్ తో దర్శనమిస్తున్నాయి దీంతో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బైంసా పట్టణంలోని పెట్రోల్ బంకులలోని పెట్రోల్ లేకపోవడంతో ఒకేసారి జాతీయ రహదారి 61 నిర్మల్ బైంసా రహదారిపై గల గీతా పెట్రోల్ బంక్ పై పెట్రోల్ ఉండడం మూలంగా ఒకేసారి రెండు వందలకు పైచిలుకు ద్విచక్రమానాలు తో పాటు డీజిల్ కు వాహనాలు అధిక సంఖ్యలో వచ్చాయి దీంతో బారులు తీరారు ఇది ఆంధ్రప్రభ కెమెరాకు చిక్కింది.

దీంతో ఒకపక్క పెట్రోలు మరోపక్క సిలిండర్ కొరత ఉండటం మూలంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సిలిండర్ సైతం ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూ సిలిండర్ తెచ్చుకుంటున్నారు అయితే పెట్రోల్ బంకులలో నో స్టాక్ దర్శనం ఇవ్వడంతో ఒక్కొక్కరు 500 నుండి 1000 రూపాయలకు పెట్రోల్ బైక్ లలో వేయించుకుంటున్నారు దీంతో నో స్టాక్ దర్శనం ఇస్తుందన్న భయం ద్విచక్రవాహనదాల్లో నెలకొంది అయితే ఈ దృశ్యం ఆంధ్రప్రభ కు చిక్కింది

Leave a Reply