Nizamabad |కంటెయినర్‌ తో ద్విచక్ర వాహనం ఢీ – స్పాట్ లో ఇద్దరి మృతి

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని పెద్ద కొడప్‌గల్ మండలం జగన్నాథ్‌పల్లి (jaganath palli) శివారులో 161వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటెయినర్‌ను( Container ) ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ( on bike) వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి ( spot dead ) చెందారు.

ఈ ప్రమాదంలో గాయపడ్డ మరొకరిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతులు జుక్కల్ మండలం మహమ్మదాబాద్‌కు చెందిన పోనుగంటి వెంకట్ (21), మంగలి గణేష్(19)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply