Nizamabad | సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ సుమలత

Nizamabad | సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ సుమలత
Nizamabad | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండల బాబానగర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీరామ్ సుమలత అరవింద్ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారి ఎంఈవో డి.స్వామి(MEO D. Swamy), వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
తమను సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీరామ్ సుమలత మాట్లాడుతూ… గ్రామాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేపడతామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.
అలాగే ఎన్నికల సమయం(election time)లో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమ్య, ఉపసర్పంచ్ మంద ఇమ్మాన్యుల్, కారోబార్ గంగ నర్సయ్య, వార్డ్ సభ్యులు మణిక్యాల జమున, బానవత్ ‘రవి, బాదావత్ శ్రీనివాస్, ఎట్టెపు భూమన్న, అనురాధ, హట్కర్ అమ్రపాల్, తోర్మిటి రాహుల్, గ్రామ అభిమాన నాయకులు తులసి, గౌస్, బాబా, ఇలియాస్, శ్రీధర్, వంశీ, భాను మొహమ్మద్ అస్లాం మజీద్, లడ్డు, అల్తాఫ్, సర్జి, అశు, మహిళలు పేద ఎత్తున పాల్గొన్నారు.
