Nirmal | సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

Nirmal | సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
- పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 16న జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వేదిక, విఐపి గ్యాలరీ, సభకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల పార్కింగ్ స్థలాలను ఎస్పీ జానకి షర్మిల మంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, కాంగ్రెస్ నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచారి, ఆదిలాబాద్, కుమ్రం భీం- ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, శ్రీహరి రావు, శ్యాంనాయక్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
