Nirmal | సర్పంచులదే కీలకపాత్ర

Nirmal | సర్పంచులదే కీలకపాత్ర
- బీజే ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
Nirmal | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అన్ని రంగాల్లో గ్రామ అభివృద్ధి జరగాలంటే సర్పంచులు తీసుకునే కీలక నిర్ణయాలతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ అనంతపేట గ్రామంలో నూతన సర్పంచు, ఉప సర్పంచ్లుగా
మాదాస్తు సునీత, నలిమెల రాములు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతపేట్ గ్రామ అభివృద్ధికి కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మాదాస్తు సునీతను ఎమ్మెల్యే మరోసారి, అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామంలోని విడిసి సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లను అభినందించి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు.
