Naveen Yadav | మంత్రుల‌తో న‌వ ఎమ్మెల్యే భేటీ..

Naveen Yadav | మంత్రుల‌తో న‌వ ఎమ్మెల్యే భేటీ..

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా.. నవీన్ యాదవ్ (Naveen Yadav) వరుసగా రాష్ట్ర మంత్రులను కలుస్తున్నారు. నిన్న సీఎం రేవంత్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన నవీన్.. ఆధిష్టాన పెద్ద‌ల‌తో సమావేశమై వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక నేడు రాష్ట్ర మంత్రుల‌ను క‌లిశారు న‌వీన్ యాద‌వ్.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ & పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ విజయం సాధించినందుకు వారు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పెద్దల మార్గదర్శకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.

అసదుద్దీన్ ఓవైసీతో Naveen Yadav భేటీ..

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో AIMIM పార్టీ త‌రుఫున‌ పూర్తి మద్దతు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఓవైసీకి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల విజయంలో AIMIM పార్టీ పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తూ, జూబ్లీహిల్స్ ప్రజలు, ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానని నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Naveen Yadav

Bihar | మహాఘట్‌బంధన్ ఎందుకు విఫలమైంది…

Leave a Reply