Negligence | ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం.. యువకుడు మృతి

Negligence | ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం.. యువకుడు మృతి
- బస్సు నిలపకపోవడమే కారణమంటున్న కుటుంబ సభ్యులు
Negligence | కొత్తచెరువు, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కొత్తచెరువు పట్టణంలో ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన తీరు వల్ల యువకుడు మృతిచెందిన సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన పురుషోత్తం తమ స్వగ్రామమైన రెడ్డిపల్లికి బయలుదేరారు. మండల కేంద్రమైన కొత్తచెరువు ఆర్టీసీ బస్సు నల్లమాడ వైపు బయలుదేరింది. బస్సు వెనుకవైపు నుంచి కేకలు వేసుకుంటూ బస్సు నిలపాలని బస్సు వెంట కొద్దిగా దూరం పరిగెత్తాడు.
బస్సు డ్రైవర్ బస్సు నిలపకపోవడంతో ఎక్కువ దూరం పరిగెత్తిన కారణంగా ఆయాసానికి గురై కిందపడి యువకుడు పురుషోత్తం అక్కడికక్కడే మరణించాడు. బస్సు నిలిపి ఉంటే పురుషోత్తం బ్రతికేవాడు. తమ స్వగ్రామానికి వెళ్లాలనే తపనతో బస్సును అందుకోవడానికి పరిగెత్తిన కారణంగా పురుషోత్తం మృతి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. పురుషోత్తం వేస్తున్న కేకలు విని డ్రైవర్ బస్సును నిలిపి ఉంటే తమ కుమారుడు బతికేవాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన తీరు కారణంగా యువకుడు మరణించాల్సిన పరిస్థితి నెలకొంది.
