నేష‌న‌ల్ క్ర‌ష్, రౌడీ బాయ్ ఒక్క‌ట‌య్యారు…

  • రీల్ జోడీ రియ‌ల్ జోడీ అయ్యింది…
  • కుంటుంబ స‌మ‌క్షంలో సీక్రెట్ ఎంగేజ్మెంట్
  • త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న విజ‌య్, ర‌ష్మిక‌

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమాయణంపై చాలా కాలంగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు, ఈ లవ్ బర్డ్స్ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందింది.

దసరా శుభ ముహూర్తంలో, రెండు కుటుంబాల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక అత్యంత గోప్యంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఇండస్ట్రీ స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. త్వరలోనే వీరి పెళ్లి కూడా ఘనంగా జరగబోతోందని తెలుస్తోంది.

‘గీత గోవిందం’తో మొదలై…

‘అర్జున్ రెడ్డి’తో దేశవ్యాప్తంగా స్టార్‌గా ఎదిగిన విజయ్, రష్మికతో కలిసి ‘గీత గోవిందం’ (Geetha Govindam) & ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) వంటి బ్లాక్‌బస్టర్‌లలో నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. మీడియా ఈ విషయంపై ప్రశ్నించినప్పుడల్లా, వీరిద్దరూ చాలా జాగ్రత్తగా సమాధానాలు దాటవేస్తూ వచ్చారు.

ఇక ఇప్పుడు, ఈ జంట బంధం ఇరు కుటుంబాల ఆమోదంతో అధికారికం అయింది. వచ్చే ఏడాది వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ శుభవార్తపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

కెరీర్ పరంగా దూకుడు..

రష్మిక గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్నా, అది మధ్యలోనే బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత ఆమె తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఇటీవలే ఆమె ‘పుష్ప 2’ (Pushpa 2), ‘ఛావా’ (Chaava) వంటి భారీ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ‘తమ్మా’ (Thamma) అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు, ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది.

మరోవైపు, విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ (Kingdom) చిత్రం కూడా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించింది. చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ వార్త బయటకు రావడంతో అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply