Narsampeta | మున్సిపాలిటీ పై కాషాయం జెండా ఎగరాలి

Narsampeta | మున్సిపాలిటీ పై కాషాయం జెండా ఎగరాలి
Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండి మున్సిపాలిటీ పై కషాయం జండా ఎగిరేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. మున్సిపాలి టీ ఎన్నికల సన్నాహక సమావేశం పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… రానున్న నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 30 వార్డులలో అభ్యర్థులుగా నిలబడి మున్సిపాలిటీ పైన కాషాయ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలన్నా రు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పాలనను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
అవినీతి పరమైన బీఆర్ ఎస్ దౌర్జన్యపరమైన పాలన, కాంగ్రెస్ 420 హామీలను చూసి ప్రజలు విసుకు చెందారని, బీజేపీకి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాట్లూ పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థులు అందరు కూడా బూత్ పటిష్టంగా చేసుకొని గడప గడపకు మోడీ చేపట్టిన అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాలని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షుడె రేసు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కూనమళ్ళ పృథ్వి రాజ్, జూలూరి మనీష్ గౌడ్, శీలం సత్యనారాయణ, బాల్నే జగన్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, పట్టణ నాయకుడు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు.
