Nani | లైనప్ అదిరింది..

Nani | లైనప్ అదిరింది..

Nani | వైవిధ్యమైన కథలతో నాని ప్రత్యేక గుర్తింపు
డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’
సుజిత్‌తో నాని కొత్త సినిమా అనౌన్స్‌మెంట్
శేఖర్ కమ్ముల కథ నానిని ఎందుకు మెప్పించలేదు?
మరో హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కమ్ముల
వెంకీ అట్లూరితో నాని కొత్త ప్రాజెక్ట్

Nani | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఆయన స్టోరీ సెలక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో దర్శకధీరుడు రాజమౌళి సైతం చెప్పి నానిని అభినందించారు. ఇదిలా ఉంటే.. నాని, శేఖర్ కమ్ముల.. ఈ ఇద్దరి కాంబోలో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దాదాపుగా ఈ కాంబో ఫిక్స్ అనుకుంటే.. సెట్ కాలేదని తెలిసింది. ఇంతకీ.. ఈ కాంబో సెట్ కాకపోవడానికి కారణం ఏంటి..?

Nani | డిఫరెంట్ స్టోరీతో.. ప్యారడైజ్

Nani

నాని ప్రస్తుతం ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అయితే.. ట్రెండింగ్ లో నిలిచింది. ఇంత వరుకు నాని చేయనటువంటి పాత్రలో కనిపిస్తుండడం.. గెటప్ కూడా కొత్తగా ఉండడంతో అసలు ప్యారడైజ్ మూవీ కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. డిఫరెంట్ స్టోరీతో రూపొందుతోన్న ప్యారడైజ్ మూవీ మార్చి 26న రావాల్సిన ఈ మూవీని ఆగష్టు 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Nani | నానిని మెప్పించలేకపోయిన కమ్ముల..

Nani

ఈ సినిమా తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో డిఫరెంట్ గా ఉండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాని ప్యారడైజ్ రిలీజ్ తర్వాత సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఆతర్వాత నాని.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కుబేర సినిమా రిలీజ్ తర్వాత నుంచి శేఖర్ కమ్ముల కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. నాని ఓ స్టోరీ లైన్ చెబితే బాగుంది.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి చెబితే కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడట. నాని చెప్పినట్టుగా మార్పులు చేసి చెప్పినా.. నానికి ఎందుకనో పూర్తి స్థాయిలో నచ్చలేదట.

Nani | వెంకీ అట్లూరితో నాని..

Nani

అందుకనే.. శేఖర్ కమ్ముల మరో యంగ్ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కమ్ముల.. నాగచైతన్యతో సినిమా చేయబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇక నాని అయితే.. వెంకీ అట్లూరితో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. కథ కూడా ఫైనల్ అయ్యిందని తెలిసింది. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. మొత్తానికి నాని లైనప్ మామూలుగా లేదుగా..

Leave a Reply