Nandyal Bureau | రైలు ఢీకొని యువకుడు మృతి..

Nandyal Bureau | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఈ రోజు రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ కు చెందిన మధు 28 యువకుడు రైలు ఢీకొని మరణించాడు. సిమెంట్ నగర్ కు చెందిన మద్దిలేటి కుమారుడు మధు ఉదయం బహిర్భుమికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వస్తూ రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. నంద్యాల రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
