Nagireddypeta | యాసంగి పంటల సాగు కోసం…

Nagireddypeta | యాసంగి పంటల సాగు కోసం…
- పోచారం నీటి విడుదల
Nagireddypeta | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుండి యాసంగి కోసం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని బీ జోన్ ఆయకట్టుకు మాత్రమే నీటిని అందిస్తామని ప్రాజెక్టు డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్రాహ్మణోత్తముల పూజ పురస్కారాల అనంతరం ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ సీ విద్యావతి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేశారు.
