ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అవనిగడ్డ వంతెన సెంటరులో కృష్ణారావు విగ్రహానికి అవనిగడ్డ దస్తావేజు లేఖరులు బచ్చు నరసింహారావు, గాజుల పాండురంగారావు, కోటేశ్వరరావు, తండు రమేష్ బాబు, దాసినేని నరేంద్ర, మిరియాల సురేష్ కృష్ణ, దాసినేని నాగ మల్లేశ్వరరావు, మిరియాల కిరణ్ బాబు, రేపల్లె రామకృష్ణ, జంపని కిషోర్, పెదపల్లి భరత్ ప్రసాద్, పోతేపల్లి శ్రీనివాసరావు, టంటం నాగేశ్వరరావు నివాళులర్పించారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీల ప్రతినిధులు, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాధ్ ప్రసాద్, నీటి సంఘాల అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, చుండూరు నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, మాదివాడ రత్నారావు, యర్రంశెట్టి సుబ్బారావు, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మానేపల్లి కోటయ్య, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, టీడీపీ టౌన్ అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, కూటమి నాయకులు బండే రాఘవ, కూరాకుల శివప్రసాద్, బచ్చు శ్రీహరి, డేగల రాఘవ, పులిగడ్డ బాలు శ్రీనివాస్, ఆకుల సీతామహాలక్ష్మి, డైరెక్టర్ అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, వార్డ్ సభ్యులు అడపా వెంకటేశ్వరరావు, నాయకులు మండలి రామ్మోహనరావు, లుక్కా వెంకట పిచ్చియ్య, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, లుక్కా శ్రీనివాసరావు, భోగాది బాలకృష్ణ, బడే సుబ్బారావు, గుగ్గిలం శ్యాంకుమార్, షేక్ మొగల్ మురాద్ బేగ్, బాబావలీ, బషీర్, సోమిరెడ్డి, సిద్ధాబత్తుని హరినాథబాబు, బడే సుబ్బారావు, యాసం శ్రీరాములు, మైలా హరిబాబు, కొండవీటి పాండురంగారావు, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, గుడివాక రాము, వాహేదుల్లా, బాలమ్మ, నారేపాలెం శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
