తప్పనిసరిగా టీకాలు వేయించాలి..

తప్పనిసరిగా టీకాలు వేయించాలి..

కడెం, ఆంధ్రప్రభ : పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలని కడెం మండల పశు వైద్యాధికారి డాక్టర్ పి.సౌందర్య, మద్దిపడగ గ్రామ సర్పంచ్ పంజాల శకుంతల రామగౌడ్ అన్నారు. కడెం మండలంలోని మద్దిపడగ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువుల ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని మద్దిపడగ గ్రామ సర్పంచ్ పంజాల శకుంతల, ఉప సర్పంచ్ డి రమణయ్య ప్రారంభించారు. కడెం మండలంలోని పశువులకు దూడలకు, ఆవులు, గేదెలకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని, ఈ టీకాలు మండల పశువుల పెంపకందారులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పి.సౌందర్య స్థానిక పంజాల శకుంతల కోరారు.

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేయడం వలన వ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి పెరుగుతుందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలల్లో ఏప్రిల్ 9 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలోని పశువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ వైద్య శిబిరంలో స్థానిక ఉప సర్పంచ్ డి రమణయ్య, పంచాయతీ కార్యదర్శి మౌనిక, జిపి వార్డు సభ్యులు, జెవిఓజే రాజేశ్వర్, పశు వైద్య సిబ్బంది విజయ, హరీష్ రాజేశ్వర్, బి రమేష్, మల్లేష్ మదన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply