Municipal Elections | బీజేపీ అభ్యర్థిగా కొప్పుల సత్యనారాయణ రెడ్డి..

Municipal Elections | బీజేపీ అభ్యర్థిగా కొప్పుల సత్యనారాయణ రెడ్డి..
Municipal Elections, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 7 వార్డు బీజేపీ అభ్యర్థిగా వికారాబాద్ మండలం బీజేపీ మాజీ అధ్యక్షుడు జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు కొప్పుల సత్యనారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తూ చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలుపొందడంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలో సత్యనారాయణ రెడ్డి కీలకపాత్ర పోషించారు.
ఈ సందర్భంగా కొప్పుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఏడవ వార్డు ప్రజల పట్ల పూర్తి నమ్మకం ఉందని క్షేత్రస్థాయిలో బీజేపీని గెలిపించడం ద్వారా రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.
