- రోహిత్ కు రెస్ట్ !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 ఆసక్తికరంగా మారుతోంది. ఈ సీజన్ ప్రారంభమై కేవలం మూడు వారాలు మాత్రమే అయినప్పటికీ… మ్యాచ్‌లు అన్ని ఉత్కంఠభరితమైన వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందో క్రికెట్ అభిమానులు ఇప్పటినుంచే అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే, నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిధ్దమైంది. వరుస ఓటములకు బ్రేక్ వేసి.. విజయాల బాటలోకి వచ్చిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) నేడు లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తమ హోం గ్రౌండ్ లో లక్నో జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టనంది.
ఇప్పటివరకు లక్నోదే పైచేయి..
ఐపీఎల్ టోర్నీల్లో ముంబై ఇండియన్స్ – లక్నో సూపర్ జెయింట్స్ ఈ రెండు జట్లు 6 మ్యాచ్‌ల్లో తలపడగా… ఈ 6 మ్యాచ్‌ల్లో ఎంఐ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, లక్నో జట్టు 5 సార్లు గెలిచింది. దీంతో నేటి మ్యాచ్ లో ముంబై జట్టుపై.. లక్నో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా.. లేక ముంబై జట్టు మరో విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
రెండు జట్లకు బల పరీక్ష
బ్యాటింగ్ పరంగా, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడారు. కానీ రిషబ్ పంత్ సహా మిగిలిన వారు ఇంకా రాణించలేదు. పంత్ మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. లక్నో రిటైన్ చేసుకున్న ఆయుష్ బడోని 51 పరుగులు చేశాడు. ఐడెన్ మార్క్రామ్ కూడా ఈ సీజన్‌ను నెమ్మదిగా ప్రారంభించాడు. ఫాస్ట్ బౌలర్లు అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్ గాయాలతో బాధపడుతున్న తర్వాత లక్నో కష్టాలను ఇది మరింత పెంచింది. ఆకాష్ ఇప్పుడు సీజన్‌లో తన మొదటి ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు.
వరుసగా పరాజయాలతో సీజన్ ప్రారంభించిన ఎంఐ, ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయంతో తిరిగి పుంజుకుంది. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా, ఎంఐ ఈ సీజన్‌లో అత్యుత్తమ బౌలింగ్ జట్లలో ఒకటిగా నిలిచింది. బ్యాటింగ్ విషయానికొస్తే, సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ర్యాన్ రికెల్టన్ కేకేఆర్ పై వేగంగా అర్ధ సెంచరీ చేశాడు. కానీ రోహిత్ శర్మ మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 21 పరుగులు మాత్రమే చేయడం ఆందోళనకరంగానే ఉంది. ఈ పోటీ రెండు జట్ల బ్యాటింగ్‌కు పరీక్షగా మారవచ్చు.
జట్టు మార్పులు:
లక్నో సూపర్ జెయింట్స్: రవి బిష్ణోయ్ స్థానంలో ఆకాష్ దీప్
ముంబై ఇండియన్స్: తిలక్ వర్మ స్థానంలో రాజ్ అంగద్ బావా
రోహిత్ శర్మకి నెట్స్ సెషన్ లో మోకాలికి గాయం కావడంతో అతను ఈ రాత్రి ముంబై తరఫున ఆడటం లేదు.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాజ్ అంగద్ బావా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, అశ్వనీ కుమార్.
లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాశ్ దీప్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ :
ముంబై ఇండియన్స్: తిలక్ వర్మ, రాబిన్ మింజ్, కార్బిన్ బాష్, కర్ణ్ శర్మ, సత్యనారాయణ రాజు.
లక్నో సూపర్ జెయింట్స్: షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, మణిమారన్ సిద్ధార్థ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్