వాజేడు, జూలై 11, ఆంధ్రప్రభ : ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలో యూత్ కాంగ్రెస్ గ్రామ పంచాయతీల కమిటీల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వాజేడు (Wajedu) మండల పరిధిలోని ఏడుజర్లపల్లి పంచాయతీలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గౌరారపు సర్వేశ్వరరావు అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరించి గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ బాబు, గ్రామ కమిటీ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయాల్లోకి యువతను తీసుకువచ్చి పార్టీని మరింతగా బలపరిచి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ముగించే విధంగా అందరూ కష్టపడాలన్నారు. ఏడుజర్లపల్లి (Edujarlapalli) గ్రామపంచాయతీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగారం మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, ఏడుజర్లపల్లి మాజీ ఉప సర్పంచ్ అంకెనబోయిన నరసింహారావు, సోషల్ మీడియా నాయకులు చెన్నం సరబాబు, చెన్నం మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఏడుజర్లపల్లి గ్రామ కమిటీ:
అధ్యక్షులు బట్ట శ్రీకాంత్ ఉపాధ్యక్షులు కొండ గొర్ల వెంకటేష్ కార్యదర్శి చెన్నం నవీన్ కోశాధికారి వాసం ఆదినారాయణ వీరితోపాటు కార్యవర్గ సభ్యులు 8 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.