Srikakulam | నిర్భంధాలతో ఉద్యమాలు ఆపలేరు….

Srikakulam | నిర్భంధాలతో ఉద్యమాలు ఆపలేరు….
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో ధర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు ఆపలేరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, ఆదివాసి వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వ పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు అన్ని గ్రామాలలో ప్రతిపాదిత ఇండోసోల్ పవర్ ప్లాంట్ ప్రతులను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 25వ తేదీన ధర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు పహరాలతో అనేకమంది గిరిజన నాయకులను గృహ నిర్బంధం చేశారన్నారు.
ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాలన్నింటిలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి ర్యాలీ, బహిరంగ సభకి వెళ్లకుండా అడ్డుకున్నారు, వెన్నెల వలస గ్రామంలో నల్ల బేనర్ తో నిరసన ప్రదర్శిస్తూ విల్లంబులు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు.
వారు మాట్లాడుతూ… శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపున అణు విద్యుత్ ప్లాంట్, మరొక వైపున ధర్మల్ ప్లాంట్, అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో జిల్లా ని ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ను వారు ప్రశ్నించారు.
ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ప్రజల భూముల్ని ఇండోసోల్ కంపెనీకి కట్ట బెట్టడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. ధర్మల్ పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు రావని బూడిద మాత్రమే వస్తుందని తద్వారా ప్రజలకి భయంకరమైన రోగాలు వస్తాయని అన్నారు.
ధర్మల్ పవర్ ప్లాంట్ తో పర్యావరణానికి తీవ్ర ముప్పని , షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తే 10 వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయని మరి ఎందుకు తెరిపించడం లేదని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయనివారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయలేని వారు 2018లో పగల గొట్టిన కోడి రామ్మూర్తి స్టేడియం ప్రహరీ గోడ నిర్మించుకోలేని వారు అభివృద్ధి కోసం మాట్లాడం హాస్య స్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
గతంలో కాకరా పల్లి లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు, పోరాట కమిటీ నాయకులు సవర సింహాచలం, బొడ్ల సురేష్, పోలాకి ప్రసాద్, వెల మల రమణ, కంట అప్పలనాయుడు, కల్లేపల్లి రమణ, కల్లేపల్లి సూర్యనారాయణ, అదపాక రామస్వామి, సూర్యనారాయణ అదపాక రాజు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
