Morphing Photos | మాయ లేడీలు..

Morphing Photos | మాయ లేడీలు..
Morphing Photos | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఇద్దరు మహిళలు సెల్ ఫోన్ లో (Cell Phone) ఉన్న సాంకేతికను టెక్నాలజీని ఉపయోగించుకొని పోలీసుల ఫొటోలను మార్ఫింగ్ చేసిన సంఘటన జిల్లాలో సంచలనం కలిగిస్తుంది. జిల్లాలోని కొలిమిగుండ్ల పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం.రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు గత కొద్ది రోజులుగా జిల్లాలోని కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పరిధిలో పని చేసిన, ఇపుడు ఉద్యోగం చేస్తున్న పోలీసు అధికారులు, పోలీసు దుస్తులలో ఉన్న ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఫేసు బుక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తరచు పదే పదే పోస్టింగ్ చేస్తూ ఉన్న ఇద్దరు మహిళలను కోవెలకుంట్ల పట్టణంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసి మార్ఫింగ్ కొరకు వాడుతున్న రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఆయన తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామానికి చెందిన బందెల స్పందన, ప్రస్తుతం కోవెలకుంట్లలోని గాంధీ నగర్ కాలనీలో (Gandhi Nagar Colony) నివాసం ఉంటున్నారు. మరొక మహిళ బందెల మార్తమ్మ అదే గ్రామానికి చెందిన మహిళ ఈమె కూడా గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. వీరి ఇరువురు గత కొద్దిరోజులుగా పోలీసు అధికారుల ఫోటోలు తారుమారు చేసి ఫేస్ బుక్, సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలను మార్పింగ్ చేసి పదే పదే పోస్టింగ్ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన, నవంబర్ 26వ తేదీన కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అంతే కాకుండా వీరు ఇద్దరూ ఈ ఏడాది మే 6 తేదీన కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి పోలీసుల పైనే దౌర్జన్యం చేసినందుకు కూడ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీరి పై ఇప్పటికి మూడు కేసుల్లో నమోదు చేశామని పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు తెలిపారు. వీరిద్దరిని జిల్లా బహిష్కరణ చేయాలని కలెక్టర్ కు నివేదిక పంపినట్లు కూడా తెలిపారు.
