Mopidevi | ఒక్కరోజు ఆదాయం..?

Mopidevi | ఒక్కరోజు ఆదాయం..?

Mopidevi, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి (Sri Subrahmanyaswamy) షష్టి మహోత్సవాల సందర్భంగా భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవా రుసుముల ద్వారా బుధవారం ఒక్కరోజు రూ.7,49,700 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ ప్రసాదరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాష్ట్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావటంతో ఆలయం కిటకిటలాడింది. నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియచేశారు.

Leave a Reply