Mobiles | సీఈఐఆర్ సేవలతో మొబైల్ ఫోన్ల రికవరీ

Mobiles | విజయవాడ, ఆంధ్రప్రభ : పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ ( సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్) సేవల ద్వారా రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేయడం నిరంతర ప్రాధాన్యతగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ డీ.సీ.పీ. కృష్ణ ప్రసన్న ఆద్వర్యంలో పోలీసు కమాండ్ కంట్రోల్ లో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న భాదితులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వారి వారి మొబైల్ ఫోన్లను వారికి గురువారం అందజేశారు.

ఇప్పటివరకు ఐదు విడతల్లో..
ఇప్పటి వరకు 5 విడతల్లో మొత్తం 2,300 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వగా.. గురువారం 6వ విడతలో సుమారు రూ. 20 లక్షల విలువైన 167 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు పోలీసులు అందజేశారు. మొత్తం రికవరీ చేసి తిరిగి ఇచ్చిన మొబైల్ ఫోన్ల సంఖ్య 2,467కు చేరుకుంది. ఈ నేపథ్యంలో సదరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్.ఆర్.జిల్లా పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీబీ రాజ శేఖర్, ఇన్స్పెక్టర్లు గుణరామ్, దుర్గా ప్రసాద్, శ్రీను, సైబర్ క్రైమ్ సిబ్బంది, మొబైల్ ఫోన్లను తిరిగిపోందిన బాధితులు పాల్గొన్నారు.

Leave a Reply