Mlc | ప్రజల మధ్య సామాన్యుడిలా ఎమ్మెల్సీ సత్యం…

Mlc | ప్రజల మధ్య సామాన్యుడిలా ఎమ్మెల్సీ సత్యం…

సాధారణ టీ స్టాల్ లో సామాన్యుడిలా టీ తాగిన ఎమ్మెల్సీ సత్యం

Mlc | చౌటుప్పల్,ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలో స్థానిక సిపిఐ నాయకులతో కలిసి రోడ్డు వెంట టీ స్టాల్ లో సామాన్యుడిలా ఎమ్మెల్సీ నెల్లికంటికంటి సత్యం టీ తాగుతూ కనిపించారు. ఎటువంటి హంగులు, ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలా కూర్చొని టీ తాగుతూ స్థానికులతో చర్చించడం అక్కడివారిని ఆకట్టుకుంది. ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పటికీ ప్రజల మధ్య ఉండాలనేదే తన ఉద్దేశమని ఈ సందర్భంగా సత్యం పేర్కొన్నారు. టీ తాగుతూ స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పట్టణంలోనీ యువత నిరుద్యోగ సమస్య, పరిశ్రమల కాలుష్యంవల్ల అనారోగ్యం, రోడ్ల దుస్థితి తదితర సమస్యలు, ఇబ్బందులపై పలువురు నివేదించగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పదవి ప్రజల సేవ కోసం మాత్రమే నని, ప్రజల మధ్యన ఉంటేనే వారి కష్టాలు తెలుస్తాయని సత్యం వాఖ్యనించారు. ఆయన వెంట సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, తీర్పారి వెంకటేశ్వర్లు, బద్దుల సుధాకర్, రెహమాన్ ఉన్నారు.

Leave a Reply