MLA | ఎమ్మెల్యే సహకారంతో.. గ్రామాన్ని అభివృద్ది చేస్తా

MLA | ఎమ్మెల్యే సహకారంతో.. గ్రామాన్ని అభివృద్ది చేస్తా

  • లింగాపూర్ గ్రామసర్పంచ్ తొంగల నర్మదశ్రీనివాస్

MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఎంతో నమ్మకంతో ప్రజలు తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామ నూతన సర్పంచ్ తొంగలనర్మద శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ‌ గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనకు ఓట్లు(votes) వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తానని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నేత కార్కూరి రాం చందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వినోద్ ను కలిసి మారుమూల గ్రామమైన లింగాపూర్ అభివృద్ధికి నిధులు(funds development) ఇవ్వాలని కోరడంతోనే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే లింగాపూర్ నుంచి ఆకెనపల్లి బీటీ రోడ్డు నిర్మానానికి, లంబడితండా నుంచి లింగాపూర్ చెరువుమత్తడి వరకు బీటీ రోడ్డు నిర్మించేందుకు రూ.2.5 కోట్లు మంజూరు చేయించడం పట్ల సర్పంచ్ నర్మద శ్రీనివాస్ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

మండలంలోని గ్రామంలో ప్రజల్లో ఎంతో మంచి పేరున్న తన భర్త శ్రీనివాస్ సహకారం, ప్రోత్సహంతో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి, ఆకెనెపల్లి నుంచి వయా లింగాపూర్ మీదుగా బట్వాన్ పల్లి, పెర్కపల్లి వరకు ఈజీఎస్ రోడ్డు(EGS road నిర్మించేలా కృషి చేస్తానన్నారు. శాంతిఖని బొగ్గు గని నుంచి లింగాపూర్ చెరువుకు నీటిని సరఫరా చేసేవిదంగా జీఎం ను కలిసి కృషి చేస్తానన్నారు. లింగాపూర్ గ్రామానికి మంజూరు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్(electricity substation) కు స్థలం ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని నన్మధ పేర్కొన్నారు.

Leave a Reply