MLA Sujana | ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి

  • పరిష్కారం కోసం కార్పొరేటర్లు అధికారులు సమన్వయంతో పనిచేయండి
  • పశ్చిమ నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

MLA Sujana | భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.. తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ కే.సత్యవతి, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జే.శ్రీనివాస్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్, జేడీ అమృత్ కేబీఎన్ఎస్ లత, డీసీపీ చంద్రబోస్, హెల్త్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, హౌసింగ్ అధికారులు, కూటమి కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్, మహాదేవు అప్పాజీరావు, బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవ, అర్షద్, ఉమ్మడి వెంకటేశ్వరరావు మైలవరపు మాధురి లావణ్య లతో కలిసి ఆదివారం సమీక్ష నిర్వహించారు. పశ్చిమలో ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యం, తదితర అభివృద్ధి పనులు, చేపట్టనున్న, ప్రారంభించవలసిన పనులను గురించి కార్పొరేటర్లను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

టిడ్కో ఇళ్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. పూర్తి అయిన, అసంపూర్తిగా ఉన్న , చేపట్టవలసిన ఇళ్లను గురించి వివరాలను అందజేయాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలన్నారు. ఇద్దరూ కలిసి పనిచేయడం వలన సమస్యలు పరిష్కారం అవుతాయని, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తవుతాయన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడం తన లక్ష్యమన్నారు. కార్పొరేటర్లు, అధికారులు తక్షణమే చేపట్టవలసిన అవసరాలు, సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా సమస్యలపై చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో టీడీపీ సీనియర్ నాయకులు మైలవరపు దుర్గారావు, అత్తలూరి పెద బాబు, రిటైర్డ్ ఎస్ఈ అర్నిపల్లి ఉదయ్ కుమార్, రిటైర్డ్ ఈఈ నారాయణమూర్తి, సీఎల్టిసీ సమత, డీఈ పురుషోత్తం, సీడీఓ శ్రీకాంత్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Leave a Reply