నివాళులర్పించిన ఎమ్మెల్యే సింహాద్రి..

కోడూరు, ఆంధ్రప్రభ ; కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన మాజీ మున్సబ్ విష్ణుభట్ల సూర్యనారాయణ వయసు రిత్యా అనారోగ్యం కారణంగా మరణించారు. శనివారం ఉదయం విశ్వనాథపల్లి గ్రామంలోని వారి నివాసం వద్ద సూర్యనారాయణ పార్థివ దేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కోడూరు, అవనిగడ్డ జడ్పీటీసీలు యాదవరెడ్డి సత్యనారాయణ, చింతలపూడి లక్ష్మీనారాయణ(లచ్చి), కోడూరు 1వ సెగ్మెంట్ ఎంపీటీసీ మరియు కోడూరు టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బడే హేమ గంగాధర్, వైఎస్ఆర్సీపీ జిల్లా రైతు విభాగం కార్యదర్శి కొండవీటి వెంకటనారాయణ, విశ్వనాథపల్లి సర్పంచ్ కొప్పనాతి శేషు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ట్రెడ్ యూనియన్ అధ్యక్షులు బండ్రెడ్డి లక్ష్మణ, వైఎస్ఆర్సీపీ నాయకులు కోట పద్మాలు, కోట సుబ్రమణ్యం, బండి నాగరాజు, విశ్వనాధుని సత్యనారాయణ, తోట దుర్గారావు, మత్తి సూరిబాబు, గోళ్ళ రామారావు, వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు చింతలపూడి బాలకృష్ణ, కొప్పనాతి శాస్త్రులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు, తదితరులు పాల్గొని సూర్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

Leave a Reply