మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టండి

మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టండి

  • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – లక్ష్మి దంపతులను వారి నివాసంలో చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సందగళ్ళ విజయ సతీష్ గౌడ్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఊడుగు శ్రీనివాస్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులు పార్టీ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్ ఆధ్వర్యంలో వెళ్లి కలిశారు.

తను మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నిక కావడానికి పూర్తి సహకారం అందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులకు జ్యోతి రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారం, వార్డుల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply