MLA Nandamuri | సినీ, రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర..

MLA Nandamuri | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఇవాళ‌ హైదరాబాద్‌లోని ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరం.. అవి ఎన్టీఆర్‌లో ఉండేవన్నారు. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లూ ఆయన బతికే ఉంటారన్నారు. సినిమాల్లో ఎవరూ చేయని పాత్రలు ఎన్టీఆర్‌ చేశారన్నారు. ప్రతిపాత్రలోనూ పరకాయ ప్రవేశంతో నటనలో ఎన్నో ప్రయోగాలు చేశారన్నారు. టీడీపీని స్థాపించి సంచలనం సృష్టించారన్నారు.

కొంతమందికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ చేర్చారు. బడుగు, బలహీనవర్గాలకు చేయూత అందించారు. తాను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వించేలా చేశారన్నారు. పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు ఆయన.. అప్పట్లో ఎన్టీఆర్‌ తీసుకొచ్చిన పథకాలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయన్నారు. ప్రజల వద్దకు పాలనను చేరువ చేశారన్నారు. తెలుగుగంగ, గాలేరు నగరిలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయన స్ఫూర్తిని టీడీపీ కొనసాగిస్తోందని బాలకృష్ణ అన్నారు.

Leave a Reply