మోదుమూడి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

మోదుమూడి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

అవనిగడ్డ ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామ ప్రధాన రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం పరిశీలించారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తన పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా మంజూరు చేసిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.91లక్షలతో రెండు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మిస్తున్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా నిర్మిస్తున్న ఈ రోడ్డును నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట పంచాయతీ రాజ్ డీఈఈ పగడాల సురేష్, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ ఉన్నారు.

Leave a Reply