( ఉట్నూర్, ఆంధ్రప్రభ ) : అదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలోని శాంతి నగర్ కాలనీలో శనివారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే (MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) మార్నింగ్ వాక్ లో జనంతో మమేకం అయ్యారు. కాలనీలో నడుచుకుంటూ ఇంటింటికి తిరిగి ప్రజలతో పలకరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. శాంతినగర్ కాలనీలో వర్షం వల్ల దెబ్బతిన ప్రాంతాన్ని పరిశీలించారు.
రోడ్డు స్లాబ్ నానీలను దెబ్బతిన్న వాటిని పరిశీలించి స్థానిక నిరుపేదలకు ఇండ్లు లేని వారి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెడ్మ బొజ్జు పటేల్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ (morning walk) కార్యక్రమం నిర్వహించినట్టు ఆయన వివరించారు. మార్నింగ్ వాక్ లో ప్రజలు తెలిపిన సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ (Congress) పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బిరుదుల లాజర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి స్వామి జిల్లెపల్లి రాజన్న నా తరపు చంద్రకళ లింగంపల్లి శ్యామల చిప్పకుర్తి పద్మ జంగం ఎల్లవ్వ కాలనీవాసులు పాల్గొన్నారు.

