MLA | ఆ ఘనత కేసీఆర్ దే

MLA | ఆ ఘనత కేసీఆర్ దే
- గ్రామపంచాయతీల్లో కేసీఆర్ ముద్ర
- తెలంగాణ గ్రామపంచాయతీలను
- యావత్ దేశానికే ఆదర్శం చేసిన ఘనత కేసీఆర్ దే
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
MLA | సూర్యాపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ గ్రామపంచాయతీలను యావత్ దేశానికే ఆదర్శం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారం వేడుకకు హాజరై ముందుగా నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించి మాట్లాడారు. గత ఉమ్మడి పాలనలో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని గ్రామాల రూపురేఖలు మార్చుకున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో పదేండ్లు ఎనలేని అభివృద్ధిని సాధించుకున్నామని, దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో మొదటి పది తెలంగాణ గ్రామాలు కావడమే అందుకు నిదర్శనమన్నారు. మొదటి 20 గ్రామాల వారీగా చూసిన 19 స్థానాలను తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకున్నాయన్నారు. అలాంటి ఘన చరిత్ర కేసీఆర్ పాలనకే సాధ్యమైందన్నారు.
పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెంచుకున్నామని, వాటి సంరక్షణకై ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా మంచినీటి సమస్య తీర్చిన విషయాన్నీ గుర్తు చేశారు. గ్రామానికో ట్రాక్టర్, వైకుంఠధామాలు, రోడ్లు, గ్రామానికి కావలసిన సౌకర్యాలన్నీ పూర్తి చేసుకున్నామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప.. గ్రామాలను ఐక్యతతో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కేసీఆర్ నేర్పిన అభివృద్ధి మంత్రం అదేనని, ఈ మార్గంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జటంగి గణిత రామనర్స్, ఉప సర్పంచ్ చెరుకుపల్లి సృజన, వార్డ్ నెంబర్స్ గంపల నరేందర్, తుల సంధ్యారాణి, దారంగుల రాంబాబు, చెరుకుపల్లి సురేష్, జటంగి నాగరాజ్ తండు మహేష్, బొడ్డుపల్లి అనిల్, గంపల శీను, గాదరి స్వరాజ్యం, గంగరబోయిన చంద్రకళ, చెరుకుపల్లి మధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తూడి నరసింహారావు పిఎసిఎస్ చైర్మన్ కొనతం సత్యనారాయణరెడ్డి, బెల్లంకొండ యాదగిరి, కస గాని బ్రహ్మం గౌడ్, వెంకట్ రెడ్డి, బొల్లిపాక సైదులు, జలగం సైదులు, ఎడవెల్లి పెద్ద ముత్తయ్య, ఎడవెల్లి చిన్న ముత్తయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
