MLA | ఘనంగా పార్వేట మహోత్సవ కార్యక్రమం…

MLA | ఘనంగా పార్వేట మహోత్సవ కార్యక్రమం…
MLA | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన నంద్యాల జిల్లాలోని అహోబిల క్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఫార్మేట్ ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు అహోబిలం ఇస్కాన్ ప్రాజెక్టు ఇన్చార్జ్ చంద్రకేశవ దాసు ప్రభు పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో గెలిచిన అహోబిలం నరసింహస్వామి వారి పేట ఉత్సవాలను ప్రతి ఏడాది ఘనంగా ర్వహిస్తున్నామన్నారు.అహోబిలం సమీపంలోని హరి నగరం వద్ద గల హరేరామ హరేకృష్ణ గోశాల ఇస్కాన్ నెల్లూరు అవుట్‌పోస్ట్ సెంటర్ వేదికగా బుధవారం అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి కార్యక్రమాలను చేపట్టామన్నారు.
ఇస్కాన్ అధిపతి మాట్లాడుతూ… ఈ ఆధ్యాత్మిక వేడుకలు ఇస్కాన్ భక్త బృందంచే నిర్వహించే సంకీర్తనలతో ప్రారంభమవు తయాన్నారు. భోజన ప్రసాద వితరణ, తులసి హారతి, గౌర హారతి మరియు నరసింహ కీర్తనలతో కొనసాగనున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పార్వేట సందేశం వినిపిస్తామన్నారు.పరమ సుకదేవ స్వామి, సహదేవ ప్రభుజీలచే విశేష ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయన్నారు.

భారతి కళా సమితి వారిచే డప్పు బృంద ప్రదర్శన, కార్యక్రమాలు ఉంటాయన్న రు. స్వామివారికి పుష్ప, దీప హారతులతో ఘనంగా ఆహ్వాన కార్యక్రమం నిర్వహించబడ ఉందన్న రు.గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మంగళ హారతి, 5 గంటలకు భక్తుల సమక్షంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి అహోబిల ప్రయాణం అంగరంగ వైభవంగా మొదలవుతుందన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
