Miss World | రామోజీ ఫిల్మ్ సిటీలో మిస్‌ వరల్డ్‌ భామలు

హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌ భామలు శనివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు.. ప్రత్యేక బస్సుల్లో చేరుకున్న విదేశీ ముద్దుగుమ్మలకు రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులు, అధికారులు..

ముత్యాల దండలు వేసి, కుంకుమ బొట్లు పెట్టి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీ సైనేజ్‌ వద్ద గ్రూప్‌ ఫొటోకు సుందరీమణులు పోజులిచ్చారు. అనంతరం ఫిల్మ్‌సిటీ అందాలను 108 మంది మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు తిలకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *