Minister | విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి

Minister | విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి

  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు, ఎస్టీ, ఎస్సి అధికారులతో సమీక్ష

Minister | భూపాలపల్లి , ఆంధ్రప్రభ ప్రతినిధి : ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎస్సి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) అధికారులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడి ఓసిలో ఇవాళ‌ మూడు జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు, వరంగల్ కలెక్టర్ సత్య శారాద, హన్మకొండ స్నేహ శబరిష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, పివో చిత్ర, అదనపు కలెక్టర్లు, ఎస్సి, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాల వారీగా ఎస్సి, ఎస్టీ గురుకులాలు, వసతి గృహల ప్రోగ్రెస్ ను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… వసతి గృహాల్లో, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రతి వసతి గృహాల్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు(CCTV cameras) ఏర్పాటు చేయాలని, బాలికల వసతి గృహాల్లో ప్రత్యేక సెక్యూరిటీని నియమించాలని సూచించారు. ప్రతి వారం విద్యార్థుల హెల్త్ చెకప్ చేయాలన్నారు. వసతి గృహాలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దన్నారు. అధికారులు విద్యార్థులకు తల్లిదండ్రుల్లా వ్యవహరిస్తూ జవాబుదారిగా వుండాలన్నారు.

జిల్లా అధికారులు వసతి గృహాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సమస్యలుంటే కలెక్టర్ ద్వారా తమకు నివేదిక పంపించాలని మంత్రి సూచించారు. ప్రతి బాలిక హాస్టల్ ను రోజు షీ టీమ్(She Team) లు సందర్శించాలన్నారు. సంక్షేమ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సిఎం రేవంత్ రెడ్ది సానుకూలంగా వున్నారని, ఎస్సి, ఎస్టీ హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌళిక వసతులు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

Minister |

ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, భూపాలపల్లి అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్,టీజీ టీ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్, రెసిడెన్షియల్ పాఠశాలల జోనల్ ఆఫీసర్లు(Zonal Officers), ఆర్ సి ఓలు, ప్రిన్సిపల్స్, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ సి డిడి, టీ డబ్ల్యూ డి, హాస్టల్ సంక్షేమ అధికారులు, ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ ఈడీలు, ఐటి డి ఏ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply